Manthani: సీనియర్ సిటిజన్ల డే కేర్ సెంటర్‌ను సందర్శించిన జడ్జి!

Manthani: మంథని సీనియర్ సిటిజన్ల డే కేర్ సెంటర్‌ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిక కోహిర్కార్. ఉచిత వైద్య శిబిరం, న్యాయ సేవలపై అవగాహన.

SHANKAR, MANTHANI
Published on: 29 Sept 2026 2:24 PM IST
Manthani
X

Manthani: సీనియర్ సిటిజన్ల డే కేర్ సెంటర్‌ను సందర్శించిన జడ్జి!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని సీనియర్ సిటిజన్ల డే కేర్ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవల కమిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిక కోహిర్కార్ సందర్శించారు.

డే కేర్ సెంటర్‌లోని వసతులను పరిశీలించిన జడ్జి సీనియర్ సిటిజన్లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీనియర్ సిటిజన్లకు అందుతున్న సేవలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జడ్జి శ్రీనిక కోహిర్కార్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీనియర్ సిటిజన్లు తమ సమస్యలను రాతపూర్వకంగా అందిస్తే.. వాటిని పరిశీలించి, చట్టపరంగా ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తామని చెప్పారు.

సెప్టెంబర్ 29న అంతర్జాతీయ హృదయ దినోత్సవం సందర్భంగా డే కేర్ సెంటర్‌లో వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లు తమకు ఉన్న ఆరోగ్య సమస్యలను వైద్యులకు తెలియజేసి, అవసరమైన వైద్య సలహాలు, చికిత్స పొందాలని సూచించారు.

సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సంస్థలు అండగా ఉంటాయని జడ్జి శ్రీనిక కోహిర్కార్ తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI