Kondagattu: కొండగట్టులో ఘనంగా అంజన్న జ్యేష్ఠాభిషేకం!
Kondagattu: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. 108 కలశాలతో స్వామివారిని అలంకరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Kondagattu: కొండగట్టులో ఘనంగా అంజన్న జ్యేష్ఠాభిషేకం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని 108 కలశాలతో విశేషంగా అలంకరించారు.
మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.




