Sircilla: ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన నివాళి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Sircilla: ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన నివాళి!
సిరిసిల్ల: ప్రముఖ ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం కోసం తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని నాయకులు కొనియాడారు. ఆయన సాహిత్యం, ప్రజా ఉద్యమాలకు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మహమ్మద్ సత్తార్ లతోపాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




