Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు, రథోత్సవం!
Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు, శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం. ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహణ.
Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలు, రథోత్సవం!
Peddapalli: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామంలో ఏటా నిర్వహించే శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవంలో గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి పల్లకిని మోసేందుకు యువకులు, గ్రామస్తులు ఒకరితో ఒకరు పోటీపడ్డారు.
డప్పు చప్పుళ్లు,యువకుల నృత్యాల మధ్య పురవీధుల గుండా ఉత్సవ ఊరేగింపు జమ్మి చెట్టు వద్దకు చేరుకొని జమ్మి చెట్టు వద్ద సర్పంచ్ బంగారి రమేష్, వారి పాలకవర్గ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం గ్రామస్తులందరూ జమ్మి ఆకులను తెంపుకొని, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
గతంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, మనస్పర్ధల కారణంగా గ్రామంలో దసరా ఉత్సవాలు సరిగా జరగకపోయేవి. అయితే పెద్దపెల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ప్రత్యేక పర్యవేక్షణలో గత రెండేళ్లుగా, అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి పాల్గొని గ్రామస్తులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీఐ రంజిత్ రావు, ఎస్సైలు సుధాకర్, సనత్ రెడ్డి, మల్లేష్, మధుకర్, అశోక్ రెడ్డిలతో పాటు ఉప సర్పంచ్ గోలి సుధాకర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




