Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ ఘనంగా సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు. అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 15 July 2026 4:59 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ ఘనంగా సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలు

కాల్వ శ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ ఎంపీపీ మాజీ జెడ్పిటిసి గోపగోని సారయ్య గౌడ్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. పలు గ్రామాల్లో అన్నదానం నిర్వహించారు.

కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తో పాటు పెగడపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ హాజరై కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషిచేసే గొప్ప వ్యక్తి సారయ్య గౌడ్ అని కొనియాడారు.

అన్నా అంటే నేనున్నానే గొప్ప వ్యక్తి కాల్వ శ్రీరాంపూర్ మండలాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ఆశీస్సులతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆయురారోగ్యాలతో ఉండి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గా జనవేన సదయ్య, ఏం సి చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సర్పంచి బంగారి రమేష్, అరెల్లి రమేష్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story