Kalva Srirampur: కల్వ శ్రీరాంపూర్ వరుణ దేవుని కోసం ప్రత్యేక ప్రార్థనలు

Kalva Srirampur: కల్వ శ్రీరాంపూర్ మండలంలో వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్-ఎ-ఇస్తిస్కా). రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించిన సారయ్య గౌడ్.

Srimanthula Kondal, Peddapalli
Published on: 18 July 2026 5:40 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: కల్వ శ్రీరాంపూర్ వరుణ దేవుని కోసం ప్రత్యేక ప్రార్థనలు

కల్వ శ్రీరాంపూర్: వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ కాల్వ శ్రీరాంపూర్ మండల ముస్లిం సోదరులు శనివారం పెద్దరాతపల్లి పోచమ్మ దేవాలయ ఆవరణ సమీపంలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్-ఎ-ఇస్తిస్కా) నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

​ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. దేశానికి వెన్నెముక లాంటి రైతు ఆనందంగా ఉండాలంటే సకాలంలో వర్షాలు పడటం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

​ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మేఘాలు కరుణించి, సమృద్ధిగా వర్షాలు కురవాలని ముస్లిం సోదర సోదరీమణులు, చిన్నపిల్లలతో సహా తరలివచ్చి అల్లాను వేడుకోవడం అభినందనీయమన్నారు. ఒక మంచి సంకల్పంతో, దృఢమైన నమ్మకంతో రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సమాజానికి ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్. మజీద్ సదర్. ఎండి రహీం. జనరల్ సెక్రెటరీ. ఎండి ఇబ్రహీం. ఎండి నౌఫిల్ ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు మేడి అశోక్ గౌడ్ శ్రీరాంపూర్ మండల్ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు గోలి సుధాకర్. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎండి మునీర్. రాజ్ మహమ్మద్ అబ్దుల్లా ఖదీర్ తాజ్ సన్నీ ముగ్దూం నసిర్ షఫీ రజ్జు మండల ముస్లిం పెద్దలు, యువకులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story