Kalva Srirampur: కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి: ఎండీ మునీర్
Kalva Srirampur: కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి: కాల్వ శ్రీరాంపూర్‌లో పద్మశాలి సంఘం వినాయకుడిని దర్శించుకున్న కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ మునీర్. ప్రత్యేక పూజలు.
Kalva Srirampur: కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలి: ఎండీ మునీర్
కాల్వ శ్రీరాంపూర్: కాల్వ శ్రీరాంపూర్ ప్రజలంతా కులమతాలకు అతీతంగా పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ మునీర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరుడికి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ.. వినాయక చవితి వంటి పండుగలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కులమత భేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని సూచించారు. మండల ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలతో గ్రామాలు కళకళలాడాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
ప్రజలందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్ సింగిల్ విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి ఉపసర్పంచ్ గోలి సుధాకర్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పద్మశాలి సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




