Kalva Srirampur: ఓటరు జాబితా సవరణ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు!
Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ ఓటరు జాబితా సవరణ గడువును ఆగస్టు 3 వరకు పెంచుతూ, పంచాయతీల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Kalva Srirampur: ఓటరు జాబితా సవరణ గడువు ఆగస్టు 3 వరకు పొడిగింపు!
kalva srirampur: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఓటర్లందరూ తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను త్వరగా పూర్తి చేసి బిఎల్‌ఓ (BLO)లకు సమర్పించాలని కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ రాముడు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బిఎల్‌ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అందజేశారని తెలిపారు. అయితే మండలంలో ఇప్పటివరకు 83.36 శాతం డిజిటైజేషన్ మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఫారమ్‌ల సమర్పణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
ఓటర్లు చివరి తేది వరకు వేచి చూడకుండా, రాబోయే రెండు మూడు రోజుల్లోనే తమ ఫారమ్‌లను నింపి బిఎల్‌ఓలకు అందించాలని సూచించారు. ఫారమ్‌లు నింపడంలో ఏవైనా సందేహాలు లేదా ఇబ్బందులు ఉంటే సహాయం చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో 'హెల్ప్ డెస్క్'లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్‌లలో గ్రామ పాలనాధికారులు, విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు మరియు స్వయం సహాయక సంఘాల (SHG) ప్రతినిధులు అందుబాటులో ఉంటారని వివరించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటర్లందరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఆయన కోరారు




