Kalwa Srirampur: కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఏక్తా దివస్

Kalwa Srirampur: జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా కాల్వశ్రీరాంపూర్ పిఎస్‌లో ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలు. లైవ్ ప్రసారాన్ని వీక్షించిన విద్యార్థులు, యువత.

KONDAL, SULTANABAD
Published on: 31 Oct 2026 8:20 PM IST
Kalwa Srirampur
X

Kalwa Srirampur: కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఏక్తా దివస్

కాల్వశ్రీరాంపూర్: జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (ఏక్తా దివస్) పురస్కరించుకొని కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై గట్ల సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు ప్రత్యేకంగా ప్రొజెక్టర్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి, నిర్వహించిన ఐక్యతా పరేడ్ ప్రత్యక్ష ప్రసారాన్ని (లైవ్) విద్యార్థులు, యువత మరియు ప్రజలతో కలిసి వీక్షించారు.

​ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడూతూ... ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశ ఐక్యత, సమగ్రతను చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భావి భారత పౌరులైన విద్యార్థుల్లో, యువతలో దేశభక్తి మరియు జాతీయ ఐక్యతా భావాలను పెంపొందించడానికే ఈ వీక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సద్భావాన్ని పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు.

​ఈ కార్యక్రమంలో ససర్పంచ్ బంగారి రమేష్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ అశోక్,పాఠశాలల విద్యార్థులు, యువకులు, గ్రామ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD