Peddapalli: కాంగ్రెస్ శ్రేణుల హడావుడి.. క్లస్టర్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలకు సన్మానం!
Peddapalli: కమాన్‌పూర్ మండలంలో ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్లస్టర్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.
Peddapalli: కాంగ్రెస్ శ్రేణుల హడావుడి.. క్లస్టర్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలకు సన్మానం!
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన క్లస్టర్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు ఆదేశాల మేరకు ఆదివారం కమాన్‌పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.ఎస్. అన్వర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన క్లస్టర్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలను అభినందించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల సమిష్టి కృషి అవసరమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎస్.ఎస్. అన్వర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తించి గౌరవిస్తుందని, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పించేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు.
రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




