Karimnagar: కరీంనగర్‌లో కపిల్ చిట్స్ చలివేంద్రం ఏర్పాటు
Karimnagar: కరీంనగర్ కోర్టు సర్కిల్ వద్ద కపిల్ చిట్స్ చలివేంద్రం ఏర్పాటు. వేసవిలో ప్రయాణికులకు తాగునీరు అందిస్తున్నారు.
Karimnagar
Karimnagar: కరీంనగర్ నగరంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చేందుకు కపిల్ చిట్స్ ఆధ్వర్యంలో కోర్టు సర్కిల్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని చిట్స్ రిజిస్ట్రార్ మక్సుద్ అలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వేసవికాలంలో ప్రజలకు మంచినీరు అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోర్టు సర్కిల్ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు అధికంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
మంచిర్యాల, గోదావరిఖని, ఆదిలాబాద్ మార్గాల్లో ప్రయాణించే వారు ఇక్కడ ఎక్కువగా నిలుస్తారని, ఎండల తీవ్రతలో వారికి తాగునీరు అందించడం అవసరమని తెలిపారు.
కపిల్ గ్రూప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, చలివేంద్రాలే కాకుండా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ మక్సుద్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, రీజనల్ మేనేజర్ మధుసూదన్, మేనేజర్ అజయ్ వర్మ, జోనల్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




