Karimnagar: వర్షాలొస్తే ముంపు ముప్పు.. చెత్తను డ్రైనేజీల్లో వేయొద్దు

Karimnagar: కరీంనగర్ 50వ డివిజన్ జ్యోతి నగర్ డ్రైనేజీల నుండి 5 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 26 Jun 2026 10:08 AM IST
Karimnagar
X

Karimnagar: వర్షాలొస్తే ముంపు ముప్పు.. చెత్తను డ్రైనేజీల్లో వేయొద్దు

కరీంనగర్: కరీంనగర్ పట్టణ ప్రజలు, ముఖ్యంగా 50వ డివిజన్ (జ్యోతి నగర్) వాసులు , డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం మానుకోవాలని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల ను డ్రైనేజీల్లో వేయడం వల్ల పూర్తి గా డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల్లో జ్యోతి నగర్ డ్రైనేజీల నుండి ఇప్పటివరకు 5 ట్రాక్టర్ల చెత్తాచెదారం ను తొలగించడం జరిగిందన్నారు.

వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేసే పనులను ముమ్మరం చేసినట్లు కార్పొరేటర్ ప్రవీణ్ రావు తెలిపారు. ఈ క్రమంలో జ్యోతి నగర్, కెమిస్ట్రీ భవన్ రోడ్డు,పరిసర ప్రాంతాల్లోని డ్రైనేజీలను పరిశీలించగా, ప్లాస్టిక్ వ్యర్ధాలతో , చెత్తా చెదారంతో నీరు ప్రవహించకుండా పూర్తిగా అడ్డుపడిందనే విషయాన్ని గుర్తించి, ప్రధానంగా డ్రైనేజీల్లో భారీ ఎత్తున పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాల్సి వస్తుందన్నారు.

ముఖ్యంగా ఇక్కడి ప్రాంతంలోనీ డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవడంతో, వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు రోడ్ల మీదికి వచ్చే ప్రమాదం ఉందన్నారు.. డ్రైనేజీలలో పేరుకుపోయిన ఈ చెత్త , వ్యర్ధాల వల్ల క్రిమి కీటకాలు దోమలు పెరిగి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

"డ్రైనేజీలలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలు మన కుటుంబాలనే ఇబ్బంది పెడతాయన్నారు. . దయచేసి ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలనీ, చెత్తను డ్రైనేజీలలో వేయకుండా, మున్సిపాలిటీ కేటాయించిన స్థలంలో(డస్ట్ బిన్) వేయాలని, చెత్త చెదారం ను ట్రాక్టర్లకు అందించాలని, పరిశుభ్రమైన పరిసరాలు, వాతావరణం కోసం సౌకర్యవంతమైన జీవనానికి డివిజన్ ప్రజలు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కార్పొరేటర్ ప్రవీణ్ రావు కోరారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story