Karimnagar: ఓటు ఉపసంహరణ హక్కు కోసం కరీంనగర్‌లో 7 గంటల నిరాహార దీక్ష
Karimnagar: ఓటును ఉపసంహరించుకునే హక్కు కల్పించాలని, ఆర్టికల్ 326ను సవరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట 7 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.
Karimnagar: ఓటు ఉపసంహరణ హక్కు కోసం కరీంనగర్‌లో 7 గంటల నిరాహార దీక్ష
కరీంనగర్: ఓటర్ల హక్కుల కోసం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఏడు గంటల నిరాహార దీక్ష చేపట్టిన యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్. ఈ సందర్భంగా యునైటెడ్ హోటల్స్ ఫౌండేషన్ అధ్యక్షులు ఫౌండర్ దిలీప్ రావు మాట్లాడుతూ ఓటర్లు అందరూ ఏకమై ఓటను ఉపసంహరించుకునే హక్కును సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మన ఓటు ఎందుకు చెల్లదు ఎన్నికల రోజు లాగే ఎన్నికల తర్వాత కూడా ఓటును ఉపసంహరించుకునే హక్కును కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వయోజనులకు ఓటు హక్కును కల్పించే 326 జీవోను సవరించి ఓటును వెనక్కి తీసుకునే హక్కును కల్పించాలని అప్పుడే ప్రజాస్వామ్య చక్రం పూర్తవుతుందని అన్నారు.
ఆర్టికల్ 326 లో ఓటు ఉంది మరి ఓటరుకు పూర్తి స్వేచ్ఛ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. ఓటర్లకు పూర్తి ప్రజాస్వామ్య హక్కులు లేనందున ఆర్టికల్ 326 సవరించాలని డిమాండ్ చేశారు. ఓటును ఓటు హక్కును ప్రజాస్వామ్య సాధికారత కోసం ఒక జాతీయ పౌర ప్రజాస్వామ్య సంస్థ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యంగా ఈరోజు ఈ నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల రోజు మాత్రమే కాదు ప్రతిరోజు ఓటరుకు ప్రాముఖ్యత ఉండాలని బలమైన ప్రజాస్వామ్యం కోసం అందరూ ఓటర్లు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యునికి అధికారిక నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. పార్లమెంటు సభ్యుడిని కలవడానికి ఓటర్లు ఆయన ఇంటికో పార్టీ కార్యాలయానికి ఎందుకు వెళ్లాలి మేము ఓటర్లము సందర్శకులము కాదన్నారు. భారత ప్రభుత్వం తక్షణమే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో అధికారిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఓటర్లు తమ ఎన్నికైన పార్లమెంటు సభ్యుని కలవడానికి, సమస్యలు వినతులు సమర్పించడానికి పరిష్కారాలు పొందడానికి వీలు కల్పించాలని కోరారు.
బలమైన ఓటర్లతో బలమైన ప్రజాస్వామ్యం ఏర్పాటు జరుగుతుందని ఇది అందరి బాధ్యత అన్నారు. ప్రభుత్వం ఓటును వేసే హక్కుతో పాటు ఓటును వెనక్కి తీసుకునే హక్కును కూడా కల్పించి ప్రజాస్వామ్య చక్రాన్ని పూర్తి చేయాలని అన్నారు.
ఇది రాజకీయం కోసం చేసే నిరసన దీక్ష కాదని ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఓటర్లను చైతన్యపరిచి ఓటుతో పాటు మన హక్కులను రక్షించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్ 25 లో ప్రారంభించి ఇప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేశామని నేషనల్ హైవే ద్వారా ఎంతో మంది చనిపోతే ఆ కాంట్రాక్టు రద్దు చేయించి ప్రజల ప్రాణాలతో పాటు ప్రజాధనాన్ని కూడా కాపాడమని, ఎల్ఐసి లో ఉన్న మిగిలిన డబ్బును ఏడు వేల కోట్ల రూపాయలను పాలసీదారులకు అందించామని అదే విధంగా నేడు ప్రజాస్వామ్యంలో ఓటును కూడా రక్షించుకుందామని దానికోసమే మా ఈ పోరాటం అని దిలీప్ రావు చెప్పారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్ సభ్యులు రాజ్ కుమార్, భారతి, మీసాల విజయ్, విజయ్ నందన్, పి. రమేష్, పటాలాల్ భూమయ్య ,లక్ష్మీనరసింహారావు ఆనందరావు, రామ్మోహన్ , సురేష్ ,అంజన్ కుమార్, ఎన్.చారి,డాక్టర్ సందీప్, సుధాకర్ గాజుల వినయ్, ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.




