Karimnagar: ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి దివస్ కార్యక్రమం

Karimnagar: కరీంనగర్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీ శక్తి దివస్ నిర్వహించి, మహిళా సాధికారతపై పిలుపునిచ్చారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 Nov 2026 11:13 PM IST
Karimnagar
X

Karimnagar: ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి దివస్ కార్యక్రమం

కరీంనగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని స్త్రీ శక్తి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్రీయ సేవిక సమితి శారీరక ప్రముఖ రమా మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన ధైర్యసాహసాలు అసమాన పోరాట పటిమ దేశభక్తి యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకమని చిన్న వయసులోనే దేశం కోసం పోరాడి బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచిన ఆమె వీరత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.

ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం నేటి యువతకు ముఖ్యంగా విద్యార్థినులకు ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.నేటి సమాజంలో మహిళలు విద్య, విజ్ఞానం, రాజకీయాలు, క్రీడలు, సాంకేతిక రంగం, రక్షణ రంగం వంటి అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటుతున్నారని.

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాలు ఆత్మరక్షణ నైపుణ్యాలు సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహిళా సాధికారత, మహిళల భద్రత, సమాన హక్కులు గౌరవప్రదమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, వంటి వీరనారుల స్ఫూర్తితో నేటి మహిళలు దేశ నిర్మాణంలో మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రెసిడెంట్ రమ్ ఝాన్సీ రాణి జోనల్ ఇంచార్జ్, అర్చన ,మనీషా మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR