Karimnagar: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎంఐఎం నేతలు

Karimnagar: కరీంనగర్‌లో మైనార్టీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ వినతిపత్రం సమర్పించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Sept 2026 8:58 PM IST
Karimnagar
X

Karimnagar: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎంఐఎం నేతలు

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో గత 12సంవత్సరాలుగా, పెండింగులో ఉన్న ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్ పనుల సాధన, పురోగతి, ముస్లిం డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులను మంజూరు చేయాలని, కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ కలిసి హుస్సేన్ వినతిపత్రం అందజేశారు.

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసుదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు, 59వ డివిజన్ కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్ తో కలిసి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈవినతి పత్రాన్ని అందజేసినట్లు గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు.

కరీంనగర్ నియోజకవర్గంలో అన్యాక్రాంతం అయిన వక్ఫ్ బోర్డు భూములను కాపాడి, ఇందులో ఈద్గా, ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, మినీ హజ్ హౌస్, మైనార్టీ గురుకులాలకు పక్క భవనాలు, మైనార్టీలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మైనార్టీ స్టడీ సర్కిల్ మంజూరు చేసి, నిర్మాణాలు చేయవచ్చన్నారు.

నగరంలోని పురాతన ఈద్గా వద్ద రోడ్డుకు మధ్యలో వేసినటువంటి డివైడర్లు తొలగించాలని, నగరంలోని పురాతన కూరగాయల మార్కెట్ స్థలాన్ని, అదాలత్ మస్జిద్, వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని, ఇతర రాజకీయ పార్టీల కార్యాలయాల మాదిరిగా, ఎంఐఎం పార్టీ కార్యాలయానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని, ఉర్దూ మీడియం టీచర్ అభ్యర్థుల కోసం, ప్రత్యేక ఉర్దూ డిఎస్సి నిర్వహించాలని, ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగ ముస్లిం యువత కోసం సబ్సిడీ లోన్ల యూనిట్ లను పెంచాలని,

పేద ముస్లిం మహిళలకు ఇచ్చేటువంటి కుట్టుమిషన్ల యూనిట్లను పెంచాలని, సంచార ముస్లిం జాతుల కోసం పనిముట్లను అందజేసే యూనిట్లను, వాహనాల యూనిట్లను పెంచాలని వినతిపత్రంలో సీఎం ను కోరారు. బొమ్మకల్ ప్రాంతంలో మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మించేలా చొరవ తీసుకోవాలని, స్మార్ట్ సిటీ ద్వారా రూ.3 కోట్ల నిధులను బైపాస్ రోడ్డు మోడల్ ఖబ్రస్థాన్ సంబంధించి, అభివృద్ధి చేసేలా చొరవ తీసుకోవాలని, కరీంనగర్ పట్టణంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు విలీనమై, కార్పొరేషన్ జనసాంద్రత పరంగా ఎక్కువగా ఉన్నందువల్ల, 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ను హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలో మంజూరు చేసి, ఏర్పాటు చేయాలని, కరీంనగర్ ముస్లింల అవసరాల కోసం 10 ఎకరాల క్లియర్ గా ఉన్న భూమిని కేటాయించాలని, చింతకుంట ఈద్గా భూమిని క్లియర్ చేసి ఇవ్వాలని కోరారు.

కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర రెండవ అధికార భాష అయిన ఉర్దూను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాకు మైనారిటీ సంక్షేమ అధికారిని, వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ను పూర్తిస్థాయిలో నియమించాలని పేర్కొన్నారు. నగరంలోని 59, 60 డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం నిధులను మంజూరు చేయాలని, కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ముకరంపుర మమత థియేటర్ వరకు పెద్ద మురుగునీటి కాలువ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. లేకుంటే ముఖరం పుర ప్రతి వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లికి సంబంధించినటువంటి సుమారు 2000 పేదల ఇండ్లకు ఇందిరమ్మ బిల్లులను మంజూరు చేసి, వాటిని నిర్మాణం చేసి పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR