Karimnagar: అంబేద్కర్ ఆలోచనలే దేశానికి మార్గదర్శకం - కొరివి వేణు

Karimnagar: కరీంనగర్‌ కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 15 Nov 2026 5:21 PM IST
Karimnagar
X

Karimnagar: అంబేద్కర్ ఆలోచనలే దేశానికి మార్గదర్శకం - కొరివి వేణు

కరీంనగర్: అంబేద్కర్ ఆలోచనలే భారతదేశానికి మార్గదర్శకం అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. నవంబర్ మూడవ ఆదివారం రోజున కరీంనగర్ కోర్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఇది గత నవంబర్ ఒకటో తేదీ నుండి ఈ కార్యక్రమం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామ్రాట్ అశోకుని కాలం తర్వాత మళ్లీ మహా భారతదేశం బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డది రెండింటి మధ్యలో భారతదేశం విభిన్న రాజుల కింద ఎన్నో రాజ్యాలుగా కొనసాగింది బ్రిటిష్ తదుపరి భారతదేశం ఒక మహా దేశంగా ఎలా కొనసాగాలనే ఆలోచన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు తీవ్రంగా ఆలోచన చేసి దేశ ఐక్యతను,సమగ్రతను ఈ విధంగా చారిత్రాత్మకమైనటువంటి అంశాలను కాపాడే విధంగా భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడం వలన ఏ రాజ్యాంగ సంక్షోభం లేకుండా భారతదేశం ఇవాళ ఒక బలమైన గణతంత్ర దేశంగా కొనసాగుతుంది కావున అంబేద్కర్ గారిని అనునిత్యం స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, కొంపెల్లి రవీందర్, తాళ్ల వెంకటేష్,సిగిరి శ్రీధర్,కడపల విజయకుమార్, క్యాద్యాసి ప్రభాకర్,మాడెపు నరసయ్య, గాదం రవీందర్ పాటకుల భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR