Veenavanka: మల్లారెడ్డిపల్లి నిరంతరంగా 75వ శుక్రవారం అన్నదానం

Veenavanka: మల్లారెడ్డిపల్లి పెద్దమ్మ గుడిలో 75 వారాలుగా కొనసాగుతున్న అన్నదానం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించి, మోదుగాకు విస్తళ్లలో భోజనాలు.

GANESH, JAMMIKUNTA
Published on: 17 July 2026 4:07 PM IST
Veenavanka
X

Veenavanka: మల్లారెడ్డిపల్లి నిరంతరంగా 75వ శుక్రవారం అన్నదానం

వీణవంక: కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో గత 75 శుక్రవారాలుగా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతు దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణను కొనసాగిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఆలయంలో ఎలాంటి పేపర్ ప్లేట్లు గాని, డిస్పోజలు గ్లాసులు గాని, వాడకుండా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, మోదుగాకుల విస్తార్లలో భోజనాలు వడ్డిస్తున్నామని తెలియజేసినారు.

అనంతరం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు గణేష్ కళాబృందం వారిచే భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ అన్న ప్రసాద వితరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మఫౌండేషన్ అద్యక్షుల ఆలయ చైర్మన్ గోనెల సమ్మన్న ముదిరాజ్, కర్రె స్వామి, దూలం కనకయ్య, కొలిపాక కనుకయ్య, కొలిపాక ఎల్లయ్య, 9వ వార్డు సభ్యులు గంధం ప్రశాంత్, అమ్మ ఫౌండేషన్ సభ్యులు బండారి సందీప్,దూలం వెంకటేష్, కొలిపాక నరేష్,దూలం సురేష్, గంజి వాసు,గంజి శశికాంత్ గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story