Karimnagar: ఓలా, ఉబర్ ఆటోలను నిలిపివేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన
Karimnagar: కరీంనగర్‌లో ఓలా, ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోతున్నామని కలెక్టరేట్ ముందు భిక్షాటన చేస్తూ ఆటో డ్రైవర్ల నిరసన. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్.
Karimnagar: ఓలా, ఉబర్ ఆటోలను నిలిపివేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన
కరీంనగర్: ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓలా ఉబర్ ఆటోల వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని కరీంనగర్ ఆటో డ్రైవర్స్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే సగం ఉపాధి కోల్పోయామని, ఆటో ఓలా ఉబర్, బైక్ రైడింగ్ వల్ల పూర్తిస్థాయిలో ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించక మా పొట్ట కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఉన్న ఆటో ఓలా ఉబర్ వంటి వాటిని నిషేధించాలని ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేనియెడల రాబోవు రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో కార్మికులను ఆదుకోవాలని భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.




