Karimnagar: చెడుపై ఎప్పటికైనా విజయం మంచిదే కేంద్ర మంత్రి బండి సంజయ్

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో చండీ యాగం, రావణ దహనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. చెడుపై ఎప్పటికైనా విజయం మంచిదేనని ఉద్ఘాటన.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 Oct 2026 9:41 PM IST
Karimnagar
X

Karimnagar: చెడుపై ఎప్పటికైనా విజయం మంచిదే కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్: చెడు చేసే వారికి ఎన్నటికీ విజయం వరించదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎన్నటికైనా చెడుపై విజయం సాధించేది ‘మంచి’ మాత్రమేనని పునరుద్ఘాటించారు. పొరపాటున చెడు చేసే వారు ఇకనైనా ప్రవర్తనను మార్చుకుని ఇతరులకు సేవ చేయాలని, అలాంటి వారిపట్ల మాత్రమే అమ్మవారి కరుణా కటాక్షం ఉంటుందని చెప్పారు.

మహిషాశుర మర్ధిని చరిత్ర కూడా అదే చెబుతుందని తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన సోమవారం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో అమ్మవారు మహిషాశుర వర్ధిని అవతారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అమ్మవారిని దర్శించకున్నారు. ఆలయంలో ‘చండీ యాగం’ పేరిట నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం భవానీ దీక్షను విరమించారు.

సాయంత్రం 7.30 గంటలకు మహాశక్తి ఆలయంలో నిర్వహించిన రావణ దహనంలో పాల్తొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హిందు బంధువులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్నాం.

చిన్ని పిల్లలు సైతం అమ్మవారికి పూజలు చేశారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు దీక్షలు ఇక్కడే చేపట్టారు. అమ్మవారిని మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఏర్పడింది. దేశంలోనే కాదు, విదేశాల్లోని తెలుగు కుటుంబాలు సైతం పెద్ద ఎత్తున దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి పర్వదినంగా జరుపుకుంటున్నాం. పొరపాటున చెడు చేస్తే ప్రవర్తన మార్చుకుని ఇతరులకు సేవ చేస్తే అమ్మవారి కరుణా కటాక్షం ఉంటుంది. చెడు ఎప్పుడు విజయం సాధించదు. అధర్మానికి చోటు లేదు. మహిషాశుర మర్ధిని చరిత్ర కూడా అదే చెబుతుంది.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR