Karimnagar: దీక్షా దివస్‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

Karimnagar: కరీంనగర్ దీక్షా దివస్ సభలో కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర విమర్శలు, నిధుల ప్రస్తావన.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 29 Nov 2026 10:26 PM IST
Karimnagar
X

Karimnagar: దీక్షా దివస్‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

కరీంనగర్: గురువు కాళ్లుమొక్కి చెప్పులు ఎత్తుకుపోయే గజ దొంగలు మీరు,గురువుకు దండం పెట్టే సంస్క్రుతి మాది అని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం పోరాడిన పార్టీ బీజేపీది,పార్లమెంట్ కు రాకుండా తుగ్లక్ రోడ్డులో తాగి పడుకున్న చరిత్ర కేసీఆర్ ది అని అన్నారు.

తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన మోసగాళ్లు మీరు…మీ చెల్లెలు మాటలే నిదర్శనం, తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నది చరిత్ర మాది,అధికారంలో ఉన్నంత కాలం రూ.లక్షల కోట్లు దోచుకున్న చరిత్ర మీదని మండిపడ్డారు.13 ఏళ్లలో రూ.13 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానిది.కడుపులో విషం పెట్టుకుని తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టుకున్న చరిత్ర కేసీఆర్ ది, తెలంగాణపై ప్రేమతో అత్యధిక నిధులిస్తున్న చరిత్ర మోదీ ప్రభుత్వానిది.

కరీంనగర్ కు రూ.వేల కోట్ల దొంగ హామీలిచ్చి మోసం చేసిన చరిత్ర మీది,కరీంనగర్ కు బడి, గుడితోపాటు రూ.20 వేల కోట్లపైగా నిధులు ఖర్చు చేసిన చరిత్ర మాదన్నారు.కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనులు సిరిసిల్ల వరకు పూర్తి కావొస్తున్నయ కళ్లుండి చూడలేని కబోధి... కేటీఆర్.

దీక్షా దివస్ కాదు... పొర్లు దండాల దీక్షలు చేసిన జనం మిమ్ముల్ని నమ్మరు, ఇక మీ బతుకులు ఫాంహౌజ్ కే పరిమితం.కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరూ తోడు దొంగలే.కల్వకుంట్ల అవీనీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోదు.కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీల వైఫల్యాలపై పోరాడే దమ్ము బీఆర్ఎస్ కు లేదు.నువ్వు కొట్టినట్లు చేయ్... నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు.

ప్రజలకు రెండు పార్టీల భాగోతం అర్ధంమైంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తాం.రాసిపెట్టుకోండి....గొల్లకొండ కోటపై ఈసారి ఎగిరేది కాషాయ జెండానే.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR