Karimnagar: మహా పాదయాత్ర సక్సెస్.. బండి సంజయ్‌ను అభినందించిన బీజేపీ చీఫ్
Karimnagar: కరీంనగర్ మహా పాదయాత్ర విజయవంతంపై బండి సంజయ్‌ను అభినందించి ఆలింగనం చేసుకున్న బీజేపీ చీఫ్ నితిన్ నబిన్; హెలిప్యాడ్ వద్ద ఆసక్తికర వ్యాఖ్యలు.
Karimnagar: మహా పాదయాత్ర సక్సెస్.. బండి సంజయ్‌ను అభినందించిన బీజేపీ చీఫ్
కరీంనగర్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన ‘మహా పాదయాత్ర’ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సంతోషం వ్యక్తం చేశారు. మహా పాదయాత్ర అనంతరం కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కు వెళ్లి కాసేపు సేద తీరిన నితిన్ నబిన్ సాయంత్రం 4.45 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్దకు వచ్చారు. హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తిరుగు పయనమయ్యారు.
హెలికాప్టర్ ఎక్కే ముందు ఆనందంతో నితిన్ నబిన్ బండి సంజయ్ చేయి పట్టుకుని ‘బండి జీ.... ‘మహా పాదయాత్ర’ గ్రాండ్ సక్సెస్ చేసినవ్. 3 రోజుల ముందే షెడ్యూల్ ఫిక్స్ చేసినప్పటికీ ఇంత పెద్దగా సక్సెస్ చేసినవ్. తక్కువ టైంలోనే చాలా చాలా బాగా ప్లాన్ చేసినవ్. మర్చిపోలేని అనుభూతి కలిగింది. మీ కష్టపడే పనితనం నాకు తెలుసు. కరీంనగర్ రావాలని మొదటి నుండి నా మనసులో ఉండేది.
అందుకే వచ్చిన. ప్రజా స్పందన బ్రహ్మండంగా ఉంది. నేనెక్కడా చూడని విధంగా కరీంనగర్ కార్యకర్తల్లో విపరీతమైన జోష్ కన్పించింది. ఆనందంతో వెళుతున్నా’’అని పేర్కొంటూ బండి సంజయ్ ను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ పరిశీలకులు సైతం ‘మహా పాదయాత్ర’కు వచ్చిన కార్యకర్తలు, జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో తరలి వస్తారని ఊహించలేదని, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన మహా పాదయాత్రల్లో ఇదే ‘టాప్’ అని పేర్కొనడం గమనార్హం.




