Karimnagar: 5న కరీంనగర్‌కు నితిన్ నబిన్: బండి సంజయ్!
Karimnagar: నవంబర్ 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ నేత నితిన్ నబిన్ రాక సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నాహక సమావేశం నిర్వహించారు. భారీ పాదయాత్ర ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
Karimnagar: 5న కరీంనగర్‌కు నితిన్ నబిన్: బండి సంజయ్!
కరీంనగర్: కరీంనగర్ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ డి.శంకర్, బాస సత్యనారాయణ, నల్లాల ఒదేలు, కోమాల ఆంజనేయులు, గుజ్జ శ్రీను, రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఓట్లు తీసేసినట్లు చెబుతున్న 13 కోట్ల ఓట్లలో కనీసం 13 మందిని కూడా తీసుకురాలేకపోయారని బండి సంజయ్ అన్నారు. సుప్రీంకోర్టు స్వయంగా సర్ ప్రక్రియ సహేతుకమే అని స్పష్టం చేసింది. విదేశీ శక్తులతో, విదేశీ ఆర్ధిక సాయంతో బొద్దింక పార్టీ పెట్టిన వాళ్లతో, నేహా బోరా వంటి అరాచక శక్తులతో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని అన్నారు.
ఈ అరాచక శక్తుల కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకే దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్ లో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో భారీ ఎత్తు న జనాన్ని సమీకరించాలి. వినూత్న రీతిలో దేశంలో 2 కోట్ల 80 లక్షల మంది చనిపోయారు. ఆ చనిపోయిన ఓట్లు తీసేయాలా? వద్దా? 1 కోటి ఓట్లు డబుల్ ఓట్లు, 6.3 కోట్ల ఓట్లు శాశ్వతంగా వలస పోయినోళ్లు, ఆచూకీ లేనోళ్లు. వాళ్ల ఓట్లు తీసేయాలా? వద్దా?
ఒకే వ్యక్తి ఓటు రెండు, మూడు చోట్ల ఉంటే తీసేసి ఒకే చోట ఉండేలా చేయాలా? వద్దా?
ఓటు హక్కు లేని వాళ్లకు ఓటు హక్కు కల్పించాలా? వద్దా? అక్రమంగా విదేశాల నుండి వలస వచ్చి ఇక్కడ ఓటు హక్కు పొందితే తీసేయాలా? వద్దా? పర్మిషన్లలో, ల్యాండ్ విషయంలో కానీ ఎవరిపై ఆరోపణలు వచ్చినా సహించే ప్రసక్తే లేదు. కలెక్షన్లకు దూరంగా ఉండాలి. ఏ కార్పొరేటర్ పైనైనా చిన్న ఆరోపణలు వచ్చినా బ్లాక్ లిస్ట్ లో పెడతా. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. ఒక ఇంటాయన పర్మిషన్ కోసం వస్తే మీ ఓటర్ అవుతాడు. ఆయన వద్దే పైసలు తీసుకుంటే రేపు ఎన్నికలొస్తే ఓటేస్తాడా? పైగా ఆ వ్యక్తి చేసే ప్రచారంతో మరో వంద ఓట్లు నష్టపోతాం. ఇకపై షాపుల వద్ద కలెక్షన్లు చేసినా, డబ్బులకు డిమాండ్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. డబ్బుల కోసం ఎవరినీ డిమాండ్ చేయొద్దు.
జాతీయ అధ్యక్షుడే కరీంనగర్ వస్తున్నారు.
హైదరాబాద్ లో అమిత్ షా పాదయాత్ర కు జన సమీకరణ సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల నుండి చేస్తున్నారు. 4 గురు ఎంపీలు జన సమీకరణ చేస్తున్నారు. కరీంనగర్ లో కథలాపూర్ నుండే 800 మందికిపైగా కార్యకర్తలను తీసుకొస్తున్నారు.
ఇకనైనా మీ స్థాయి, మీ కెపాసిటీని బట్టి జనాన్ని, కార్యకర్తలను తీసుకురండి. ఎవరు ఎంత మందిని తీసుకొస్తారో నిజాయితీగా చెప్పండి.డివిజన్ల వారీగా బయట నుండి ఇంఛార్జీని పెట్టాలి. హల్ చల్ వాతావరణం క్రియేట్ చేయాలి. ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టండి. మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం చేయండి. మహిళా గ్రూపులను తీసుకురావొద్దు. కామన్ మ్యాన్ ను తీసుకురండి. 30 వేల మందిని కచ్చితంగా ర్యాలీలో ఉంచేలా చేస్తాం.
నితిన్ నబిన్ టూర్ గ్రాండ్ సక్సెస్ కావాలి....
అందుకోసం ఎంతైనా కష్టపడి జన సమీకరణ చేయాలి. ఓడిపోయినం. ఇంట్లనే కూర్చుంటారా? టిక్కెట్ ఇచ్చి పైసలిచ్చి ప్రచారం చేసినం, గెలిచినోళ్లు కూడా పని చేయడం లేదు. లూజ్ కామెంట్స్ చేస్తరు.ఇది పద్దతి కాదు పార్టీ ఎవరిపైనా ఆధారపడి ఉండదు. బ్లాక్ మెయిల్ చేస్తే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా.కరీంనగర్ టౌన్ లో పెడితే 3 వేల సంఖ్య వస్తదా? పార్టీ చెబుత లేదు అని కుంటి సాకులు వద్దు మన గ్రామంలో, మండలంలో గట్టిగా పనిచేస్తే పార్టీయే పిలిచి గౌరవమిస్తది.
సిరిసిల్లలో ఇక్కడికంటే ఎక్కువ క్యాడర్ ఉంది. ప్రతి నాయకుడిపై 20కి పైగా కేసులున్నయ్. 20 శాతం మంది లీడర్లు జైలుకు వెళ్లారు.మీ గుండెపై చేయి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోండి. నేను పార్టీకి ఏం చేస్తున్నా. పార్టీ నాకేమిచ్చిందని అంటున్నరు. పార్టీ టిక్కెట్ ఇచ్చింది. పైసలిచ్చింది. మీ కోసం కష్టపడింది. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంఖ్య బాగా వచ్చింది. మండలాల వారీగా మీటింగ్ లు జరుగుతున్నయ్. ప్రచారం జరుగుతోంది. మహిళా మోర్చా మీటింగ్ లు చాలా బాగా జరిగాయి. రామచంద్రరావు నాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ కరీంనగర్ టౌన్ విషయానికొస్తే వెరీ పూర్ నిరంతరం జనంలో తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తేనే మనం బలంగా ఉన్నట్లు. పార్టీ గుర్తే మన బలం అన్నారు.




