Karimnagar: ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి: కరీంనగర్ బీజేపీ నేత గంగాడి కృష్ణారెడ్డి పిలుపు
Karimnagar: ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు
Karimnagar: ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి: కరీంనగర్ బీజేపీ నేత గంగాడి కృష్ణారెడ్డి పిలుపు
కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10 వ తేదీ ఆదివారం రోజున హైదరాబాద్ రానున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు బిజెపి శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి, సభను సక్సెస్ చేయాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ లోని టవర్ సర్కిల్లో ప్రధాని మోడీ సభకు తరలి వెళ్లే వాహనాలకు సంబంధించిన పోస్టర్ ను జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి , మేయర్ కోలగని శ్రీనివాస్, కార్పొరేటర్లు , బిజెపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి హైదరాబాద్ వస్తున్నారని, ఈ నేపథ్యంలో లక్షలాది మందితో ఈనెల 10 ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాదులోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలందరిపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా సభకు తరలిరావాలని కోరారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలనే ఆలోచనతో జిల్లా పార్టీ ఉందని, ఆ దిశలో నే అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో జన సమీకరణ చేయాలని సూచించారు. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చే వారి కోసం రవాణా, కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశామని, వాటిని వినియోగించుకోవాలని కోరారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారనీ, 3వ సారి ప్రధాని పగ్గాలు చేపట్టిన తరువాత హైదరాబాద్ తొలిసారి రాబోతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులంతా తమ అనుచరులు, టీంతో తప్పనిసరిగా పరేడ్ మైదానానికి తరలి రావాలని కోరారు.. ప్రతి ఒక్కరూ మోదీ సభకు ఆహ్వానిస్తూ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రధాని మోడీ సభ సక్సెస్ తో తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని, రాష్ట్రవ్యాప్తంగా బిజెపి గాలి వీచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు...ఈకార్యక్రమంలోకరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ళ రమేష్ ,ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్, కార్పొరేటర్లు వంగల పవన్ కుమార్, కె ఏపీపీ చంద్ర తోట అనిల్, కన్న కృష్ణ, సర్దార్ బల్బీర్ సింగ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, దండు కొమురయ్య, మండల/జోన్ అధ్యక్షులు తణుకు సాయి కృష్ణ, భూమల అనిల్ కుమార్, ముత్తునూటి హరీష్ , కుంట తిరుపతి ,కొండల్ రెడ్డి ,దొంతుల రమేష్, ర్యాకం శ్రీనివాస్, బీజేపీ ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు అడిచెర్ల , ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ,దూలం అనిల్ ,కలికోట మోహన్ కచ్చకాయల రాజు సతీష్ ,శశి , భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




