Timmapur: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ దిష్టిబొమ్మ దహనం

Timmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో బీజేపీ ఆఫీస్‌పై దాడి, రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. బీజేపీ నేతల తీవ్ర నిరసన.

ANJANEYULU, MANAKONDURU
Published on: 3 Sept 2026 11:52 PM IST
Timmapur
X

Timmapur: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ దిష్టిబొమ్మ దహనం

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను ఈ రోజు తిమ్మాపూర్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై దనహం చేశారు, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం బీజేపీ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించడం, బీజేపీ రాష్ట్ర్క అధ్యక్షుడిని అక్రమ అరెస్టును నిరసిస్తూ, సంఘ సంస్కర్త రవి సంతదాస్ కవి విగ్రహంపైన నల్ల రంగు చల్లడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్, వేల్పుల ఓదెలు యాదవ్, ఎలుకపల్లి స్వామి, సంపత్ కుమార్, బూట్ల శ్రీనివాస్, బోనాల మోహన్, గొట్టిముక్కల తిరుపతిరెడ్డి,తమ్మనవెణి రాజు, గడ్డం అరున్, జాడి రాజు ప్రదీప్ రెడ్డి,బుర్ర శ్రీనివాస్ గౌడ్, రామిడి మహేందర్ రెడ్డి, దుర్షెటి అజయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story