Karimnagar: 40 డివిజన్లలో జరిగిన ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియపై సమీక్ష
Karimnagar: కరీంనగర్ నగరంలోని 40 డివిజన్లలో ఓటరు జాబితా ప్రక్షాళన, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై బీజేపీ కీలక సమీక్ష.
Karimnagar: 40 డివిజన్లలో జరిగిన ఓటరు జాబితా ప్రక్షాళన ప్రక్రియపై సమీక్ష
కరీంనగర్: నగరంలోని 40 డివిజన్లలో ఓటరు జాబితా ప్రక్షాళన , స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ( ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ తో పాటు వివిధ కార్పొరేటర్లు, ఇన్చార్జులు, జోన్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ బాధ్యులు, బిఎల్ఎ 2లు, శక్తి కేంద్ర ఇన్చార్జులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నగర పరిధిలోని అన్ని డివిజన్లలో ఓటరు జాబితాలో ఓట్ల నమోదు, డూప్లికేట్ ఓట్ల వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో జరిగిన పరిశీలనను నాయకులు సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్క యువతీయువకుడికి ఓటు హక్కు కల్పించే దిశగా బూత్ స్థాయి కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. జాబితాలో ఎటువంటి లోపాలు లేకుండా చూసే బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు.
"ప్రజాస్వామ్యంలో ఒక్క అర్హడైన ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హుల పేర్లు చేరకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. నగర అభివృద్ధిలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ ప్రతి ఓటూ కీలకమేనని , 40 డివిజన్లలో పార్టీ శ్రేణులు చేపట్టిన ఈ ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగడం సంతోషకరమైన పరిణామని
నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, జోన్ అధ్యక్షులు , డివిజన్ బాధ్యులు, ప్రధాన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డివిజన్లలోని ఓటరు జాబితా స్థితిగతులను ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి వివరించారు.




