Karimnagar: కరీంనగర్ ఎంపీ కార్యాలయంపై దాడి యత్నం బీజేపీ తీవ్ర ఆగ్రహం
Karimnagar: కరీంనగర్ ఎంపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి యత్నాన్ని ఖండించిన బీజేపీ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు. దాడులు పునరావృతమైతే ఊరుకోమని హెచ్చరిక.
Karimnagar: కరీంనగర్ ఎంపీ కార్యాలయంపై దాడి యత్నం బీజేపీ తీవ్ర ఆగ్రహం
కరీంనగర్: కరీంనగర్ ఎంపీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడికి యత్నంపై మండిపడ్డ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు. ప్రతిపక్ష పార్టీ గా కూడా జనం గుర్తించడం లేదని రాజకీయ డ్రామాలతో ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ధర్నా చేస్తోందని మండిపడ్డరు.
ప్రశాంతమైన కరీంనగర్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, దాడులు చేస్తే మేము కూడా తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పాలక పక్షంగా ఉంటూ దౌర్జన్యం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేవలం దాడులే ధ్యేయంగా కాంగ్రెస్ కార్యాలయం పైకి దూసుకు రావడం సమంజసం కాదని మేము కూడా చేయాలనుకుంటే మీ మీ కార్యాలయాలపై కూడా దాడులు చేస్తామని అన్నారు.
కేవలం కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ కోసం ఈ నిరసనలు ధర్నాలు చేస్తారని అన్నారు. దాడిలో పలువురు బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయని కుమార్ ఇలాంటి పునరావతం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.




