Karimnagar: దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం
Karimnagar: కరీంనగర్లో పూలే వర్ధంతి వేడుకల్లో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొని, దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
Karimnagar: దీక్షా దివస్ పేరుతో బీఆర్ఎస్ రాజకీయం
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటులో గళమెత్తి, బిల్లు ఆమోదం పొందడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేషన్ విప్, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. బీజేపీ ఓబిసి మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలలో ప్రవీణ్ రావు పాల్గొన్నారు.
కరీంనగర్ లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం బీఆర్ఎస్ పై వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీజేపీ ఎంతో పోరాడిందని ప్రవీణ్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యంగా 'తెలంగాణ చిన్నమ్మ'గా పేరుగాంచిన దివంగత నేత సుష్మ స్వరాజ్ చట్టసభల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం బలంగా కొట్లాడారని ఆయన కొనియాడారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతుగా నిలవడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందన్నారు. అలాగే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీరుపై ప్రవీణ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'దీక్షా దివస్' పేరిట బీఆర్ఎస్ నాయకులు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సెంటిమెంట్ రాజకీయాలను నమ్మే పరిస్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు.




