Karimnagar: టీఎంయూ కూటమిని గెలిపించండి - చాడ వెంకటరెడ్డి పిలుపు
Karimnagar: కరీంనగర్‌లో ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి. టీఎంయూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు.
Karimnagar: టీఎంయూ కూటమిని గెలిపించండి - చాడ వెంకటరెడ్డి పిలుపు
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో పనిచేస్తున్న కార్మికుల,ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్, టిఎంయూ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని సిపిఐ జాతీయ నేత,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్ లోని ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్ వద్ద సిరిసిల్ల, వేములవాడ,జోనల్ వర్క్ షాప్ కార్మికులతో చాడ వెంకటరెడ్డి కార్మికులతో కలిసి ప్రచారం నిర్వహించారు.అనంతరం ఫిలిం భవన్ లో జరిగిన కరీంనగర్,వన్,టూ డిపోల కార్మికుల సమా ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రోజున ఆర్టీసీ ఎన్నికలు జరగనున్నాయి.
కార్మికుల చిరకాల కోరిక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,అన్ని విభాగాల కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావాలంటే,నిరంతరం కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ అలాగే టీఎంయూ కూటమి గెలవాల్సిన అవశ్యకత ఉందని, ప్రశ్నించే గొంతుకలను గెలిపించడం ద్వారానే ప్రభుత్వం కార్మికుల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తుందని,భారీ మెజార్టీతో ఎంప్లాయిస్ యూనియన్,టీఎంయూ కూటమిని గెలిపించాలని,బస్సు గుర్తుపై,నిచ్చెన గుర్తుపై కార్మికులు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
సిరిసిల్ల డిపో,వేములవాడ డిపో,కరీంనగర్ జోనల్ వర్క్ షాప్ తో పాటు కరీంనగర్ వన్,టూ డిపోలలో కార్మికులను వెంకటరెడ్డి కలిసారు.
ఈ కార్యక్రమాలలో సిపిఐ కరీంనగర్,రాజన్న సిరిసిల్ల జిల్లాల కార్యదర్శులు పంజాలశ్రీనివాస్, మంద సుదర్శన్,ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ కూటమి నాయకులు బెజ్జంకి కాళిదాసు,కొమురయ్య, ఏ.వి.ఆర్.రెడ్డి.ఏం.ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




