Karimnagar: 'చాయ్ పే చర్చ' మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలి!

Karimnagar: కరీంనగర్ సిరి టీ హోటల్ వద్ద 'చాయ్ పే చర్చ'. సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మేధావులు, లాయర్లు, విద్యార్థులతో సమావేశం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 July 2026 4:45 PM IST
Karimnagar
X

Karimnagar: 'చాయ్ పే చర్చ' మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలి!

Karimnagar: దేశం, ధర్మం అంటూ బిజెపి మాటలకే పరిమితం అవుతోందని, దేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నీట్ పరీక్ష లీకేజీ పై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో నరేందర్ రెడ్డి వినూత్నంగా బిజెపి దమన నీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కరీంనగర్లో చాయ్ పై చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

విద్యావంతులు, మేధావులు, లాయర్లు, సీనియర్ సిటిజనులతో కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను వారితో పంచుకున్నారు. మేధావుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, అందమైన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. విద్యార్థులపై లాఠీ చార్జి చేయటంతో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పార్లమెంటులో గళం విప్పారని, ప్రధానమంత్రి అధికారిక నివాసం ముందు శాంతియుత ధర్నాకు దిగితే వారిని కర్కషంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.కలెక్టరేట్ రోడ్డులోని సిరి టీ హోటల్ వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కొరివి వేణుగోపాల్,పెంచాల లక్ష్మణ్ రావు,ప్రముఖ డాక్టర్లు చాట్ల శ్రీధర్, వొడ్డే రాంరెడ్డి వాకర్స్ గుడిపాటి రమణారెడ్డి, పి కిషన్ రావు,ఎల్లారెడ్డి,బోయిని అశోక్ తో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోతోందని భేషరతుగా విద్యార్థి లోకానికి ప్రధాని మోదీ,అమిత్ షా క్షమాపణ చెప్పాలని ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులపై దమననీతి ప్రదర్శించడంలో కుట్ర దాగి ఉందని ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అని నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story