Karimnagar: చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి సీఐటీయూ నాయకులు
Karimnagar: కరీంనగర్లో సీఐటీయూ ఆధ్వర్యంలో 'చలో హైదరాబాద్' పోస్టర్ ఆవిష్కరణ. రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి డిమాండ్.
Karimnagar: చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయండి సీఐటీయూ నాయకులు
కరీంనగర్: సీఐటీయూ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 25,26 తేదీలలో జరగనున్న చలో హైదరాబాద్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా గీట్ల ముకుంద రెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టిస్తున్న శ్రామిక వర్గానికి సంపదలో సరియైన వాటా ఇవ్వాలని అందుకు ఫ్లోర్ లెవెల్ కనీస వేతనం రూ.42 వేలకు తక్కువ కాకుండా ఉండాలని డిమాండ్ చేశారు. దేశ తలసరి ఆదాయం సుమారుగా 2,40,000 తెలంగాణ తలసరి ఆదాయం 4,19,000 ఉన్నదన్నారు.
ఒక కుటుంబం సగటు నలుగురు వ్యక్తులు ఉంటారని, ఆ లెక్కన దేశంలో పనిచేసే 45 కోట్ల మంది శ్రామికులు, కార్మికులు, రైతులు, వైట్ కలర్, ఇతర అన్ని రకాల ఒక్కొక్క శ్రామికుడు సగటున నెలకు రూ.80 వేల పైన సంపద సృష్టిస్తున్నారని కానీ దేశంలో పని చేస్తున్న 93 శాతం మంది శ్రామికులకు నెలకు రూ.8 నుండి 12,000 మాత్రమే పొందుతున్నారని అన్నారు. మిగతా సంపద అంతా ఈ దేశంలోని ఒక శాతం మందికి కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నారని విమర్శించారు.
సంపద పంపిణీ శ్రామిక వర్గాలకు జరగాలని, అందుకు కార్మిక వర్గం రైతులను ఇతర శ్రామికులను కలుపుకొని పోరాడాలని పిలుపునిచ్చారు. పనిచేసే చోట శ్రమ ఉత్పత్తికి తగిన విధంగా వేతనాలు ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కనీస వేతనాలను నామమాత్రంగా చెల్లించే విధంగా జీవోలు విడుదల చేస్తున్నాయని, మరోవైపు ఉచితల పేరుతో ఓట్లను పొందుతున్నారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంస్థల కోసం, కొంతమంది వ్యక్తుల కోసం సంపద ధారపోయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడలు వచ్చాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టు కార్మికులతో, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పని చేసుకుంటూ వేలకోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
ఎన్టిపిసి కి దేశవ్యాప్తంగా నూట 119 ప్రొడక్షన్ యూనిట్లు 90 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. ఈ మొత్తం ప్లాంట్లలో ఒక లక్ష 25 వేల మంది పనిచేస్తుండగా లక్షమంది కాంట్రాక్టు కార్మికులతో పని చేస్తుందని అన్నారు. 2024-25 సంస్థ లాభాలు రూ.27 వేల కోట్లుగా ఉన్నదన్నారు. ఒక్కొక్క కాంటాక్ట్ కార్మికునికి నెలకు లక్ష రూపాయలు జీతం పెంచినప్పటికీ ఇంకా 17 వేల కోట్ల లాభాలు సంస్థ ఆర్జిస్తుందని అన్నారు.
ఇంత తీవ్రస్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థనే ఒక తరం కార్మిక వర్గాన్ని దోపిడీ గురి చేసిందని, అందుకే ఈ వ్యవస్థ మార్పు కోసం కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, జనగాం రాజమల్లు, జి రాజేష్ పాల్గొన్నారు.




