Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ
Karimnagar: కరీంనగర్ ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులు, పలువురికి గాయాలు. రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేసిన పోలీసులు.
Karimnagar: కరీంనగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ
కరీంనగర్: కరీంనగర్ లో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బిజెపి కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో పలువురు కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు గాయాలయ్యాయి. దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ నాయకులు.
కార్యకర్తలు నిరసన తెలిపి కరీంనగర్ బిజెపి ఎంపీ బండి సంజయ్ స్పందించాలని కోరుతూ ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు రావడంతో కార్యాలయంలో ఉన్న బిజెపి కార్పొరేటర్లు కార్యకర్తలు దూషించుకుని దాడులు చేసుకున్నారు.
పోలీసులు వారించి అదుపు చేయాలని చూసినా గొడవ సద్దుమనగా లేదు. ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇది వర్గాలను శాంతింపజేసి కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడినుండి తరలించారు.
రెండు కార్యాలయాల ముందు భారీగా పోలీసుల మోహరింపు...
ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా కార్యాలయం మీదికి తీసుకొస్తే మీ కార్యాలయం పై దాడులు చేస్తామని అనడంతో పోలీసులు అప్రమత్తమై రెండు కార్యాలయాల వద్ద దాడులు జరగకుండా ముందస్తుగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు. బిజెపి కార్యాలయంలో దాడి జరిగిందని వార్త వినడంతో ఒక్కసారిగా నగరంలోని బిజెపి కార్యకర్తలు ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
శాంతి దీక్ష దాడుల దీక్షగా మారింది....
కరీంనగర్లో శాంతియుత నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గాంధీ వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ కార్యాలయం వరకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తో పాటు, మాజీ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, ఇతర మహిళ నాయకురాలు కార్యకర్తలు భారీగా తరలివచ్చి బండి సంజయ్ స్పందించాలని నినాదాలు చేశారు. పోలీసులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో చాలాసేపు దాడులు జరిగాయి.
ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు శాంతి పరిస్థితులు పడే విధంగా చర్యలు చేపట్టారు. ముందస్తు దాడులు జరగకుండా ఇరు కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం వల్ల ఘర్షణ వాతావరణం ఉంటుందని పోలీసులు ముందస్తు చేపట్టారు.




