Karimnagar: ప్రజావాణి బాధితులకు టీఎన్జీవోల అండ.. కలెక్టర్ ప్రశంస
Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్‌లో టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రారంభించారు.
Karimnagar: ప్రజావాణి బాధితులకు టీఎన్జీవోల అండ.. కలెక్టర్ ప్రశంస
Karimnagar: తెలంగాణ ఎన్జీవోల సంఘం, కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన ప్రజల కోసం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే కరీంనగర్ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ తరఫున స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా గ చేతుల మీదుగా ప్రారంభించారు. చలివేంద్రం మరియు ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ,
ఇటీవలి కాలంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమాలకు దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, వారి దాహార్తిని తీర్చడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. చల్లని తాగునీరు, మజ్జిగ వంటి పదార్థాల పంపిణీ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆమె అన్నారు.
అదేవిధంగా ఉద్యోగులు కూడా ఎండల ప్రభావంతో అలసటకు గురవుతున్నారని, చలివేంద్రం ఏర్పాటు చేయడం వారికి కూడా ఎంతో ఉపయుక్తమని తెలిపారు. సమాజ సేవా భావంతో ఈ కార్యక్రమాలను నిర్వహించిన సంఘ నాయకులను అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మండుతున్న ఎండల్లో ప్రజలు మరియు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, ఆర్డీవో కే. మహేశ్వరరావు, ఏవో గడ్డం సుధాకర్, తహసీల్దార్లు నరేందర్, రాజేష్, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి విజయకుమార్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హరేందర్ సింగ్, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్,
కార్యదర్శి వెలిచాల సుమంతరావు, రూరల్ అధ్యక్షులు వాస్తవిక్ గౌడ్, కార్యదర్శి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి, మహిళా నాయకులు శారద, సబిత, సునీత, హరిప్రియ, సూర్య, పెన్షన్ సంఘం నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, మోసం అంజయ్య, జిల్లా నాయకులు గోవిందపతి శ్రీనివాస్, కొండయ్య, శంషుద్దీన్, కమలాకర్, కరుణాకర్ తదితర సంఘ నాయకులు, ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొన్నారు.




