Karimnagar: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

Karimnagar: కరీంనగర్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించి 197 అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Sept 2026 5:33 PM IST
Karimnagar
X

Karimnagar: ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి

కరీంనగర్: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి , డీఆర్వో స్వామి, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి 197 అర్జీలు స్వీకరించారు. మొత్తం అర్జీలు లో అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 68, కరీంనగర్ నగరపాలక కు 29 దరఖాస్తులు వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

పరిష్కరించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు లాగిన్ లో అప్ డేట్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story