Karimnagar: కలెక్టరేట్ ఆర్చిని ఆకర్షణీయంగా నిర్మించాలి.. కలెక్టర్ !
Karimnagar: కరీంనగర్ నూతన కలెక్టరేట్‌లో నిర్మిస్తున్న ఆర్చి పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు.
Karimnagar: కలెక్టరేట్ ఆర్చిని ఆకర్షణీయంగా నిర్మించాలి.. కలెక్టర్ !
Karimnagar: కరీంనగర్ నూతన కలెక్టరేట్‌లో నిర్మిస్తున్న ఆర్చి ఆకర్షణీయంగా, నాణ్యతతో, జిల్లాకు గుర్తింపుగా ఉండేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
నూతన కలెక్టరేట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆర్చి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్చి నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న పరిసరాలను సుందరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రధాన గేటు నిర్మాణంతో పాటు రహదారి, ల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి నిర్మాణ పనిలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కలెక్టరేట్‌కు వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఆర్చి నిర్మాణం ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను సమన్వయంతో నిర్వహిస్తూ కలెక్టరేట్ పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, ఆర్ అండ్ బి ఈఈ కుమారస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




