Karimnagar: చట్టబద్ధమైన దత్తతే పిల్లలకు రక్షణ.. జిల్లా కలెక్టర్ చిత్రా
Karimnagar: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో దత్తత అవగాహన హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రారంభించారు.
Karimnagar: చట్టబద్ధమైన దత్తతే పిల్లలకు రక్షణ.. జిల్లా కలెక్టర్ చిత్రా
Karimnagar: శిశువులు, చిన్నారుల దత్తత విషయంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో "పిల్లల భద్రత, రక్షణ - సే నో టు డ్రగ్" అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా దత్తత అవగాహన హెల్ప్ డెస్క్ ను కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల భద్రత సంక్షేమం కోసం చట్టబద్ధమైన దత్తత తప్పనిసరి అని తెలిపారు.
ఈ సహాయ కేంద్రం ద్వారా శిశు గృహ, బాలసదనం నుండి దత్తత ఎలా తీసుకోవాలో ప్రజలకు వివరిస్తామని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి తెలిపారు. రక్తసంబంధీకులనుండి దత్తత తీసుకున్నప్పటికీ అది చట్టబద్ధంగా ఉండాలని అన్నారు. ఏ విధమైన దత్తత ఎలా తీసుకోవాలో తెలియజేస్తూ పూర్తి సహకారం అందించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 108 దత్తతలు విజయవంతంగా పూర్తయ్యాయని, వాటిలో 6 అంతర్జాతీయ దత్తతలు (Inter-country Adoptions) ఉన్నాయని అన్నారు. దత్తతకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రజలు 1098 (చైల్డ్‌లైన్) లేదా 9490881098 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సి డబ్ల్యూ సి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డిపిఓ జగదీశ్వర్, సిడబ్ల్యుసి సభ్యులు పాల్గొన్నారు.




