Karimnagar: మే 11 నుండి జనాభా గణన.. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద అవగాహన కార్యక్రమం!
Karimnagar: కరీంనగర్‌లో 'జనాభా గణన 2027' అవగాహన ఫ్లెక్సీలను ఆవిష్కరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా.
Karimnagar: మే 11 నుండి జనాభా గణన.. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద అవగాహన కార్యక్రమం!
కరీంనగర్: “మన జనాభా గణన – మన అభివృద్ధి” అనే నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ వద్ధ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి సమాచారం నమోదు చేసుకోవడం అందరి ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. జనాభా గణన తొలి దశ, మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దశలో ఎన్యూమరేటర్లు ఇండ్ల జాబితా, గణన చేపడతారని వివరించారు. దీనికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వీయ గణన (Self Enumeration) చేయాలని సూచించారు.
దీనికోసం (se.census.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించి స్వీయ గణన ఐడి పొందాలని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఆ ఐడిని తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, సందర్శకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనాభా గణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాం దత్తా రెడ్డి, జిల్లా సెన్సస్ అధికారి తిరుపతి పాల్గొన్నారు.




