Karimnagar: జనగణనలో తప్పులకు తావివ్వొద్దు.. కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎన్యూమరేటర్లకు శిక్షణ ప్రారంభమైంది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 21 April 2026 9:56 PM IST
Karimnagar
X

Karimnagar: జనగణనలో తప్పులకు తావివ్వొద్దు.. కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. తప్పులు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలన్నారు. డిజిటల్ సర్వేపై అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. గత సర్వేల్లో పాల్గొన్న సిబ్బంది అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని తెలిపారు. రెండవ దశ ఫిబ్రవరి 2027లో వ్యక్తులవారీగా సమాచారం సేకరిస్తారని పేర్కొన్నారు. అధికారులు ప్రతి కుటుంబం వివరాలు పక్కగా సేకరించి నమోదు చేయాలని సూచించారు. అందరు వివరాలు గోప్యంగా స్పష్టం చేశారు. జనగణను సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లు బాధ్యత విధంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ నిబంధనలు పాటిస్తూ సర్వే పూర్తి చేయాలని సూచించారు. హౌస్ లిస్టింగ్.. ఇద్దరి అంశాలపై పలు సూచనలు చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story