Karimnagar: కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్!
Karimnagar: కరీంనగర్ జిల్లాకు సంబంధించి హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ఆదేశించారు.
Karimnagar: కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్!
కరీంనగర్: జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉన్న కేసుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.
కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో గవర్నమెంట్ ప్లీడర్లు, అదనపు గవర్నమెంట్ ప్లీడర్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తాసిల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ కోర్టు కేసుల పురోగతిని సమీక్షించారు. జిల్లాకు సంబంధించిన హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, వాటి ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి శాఖ కోర్టు కేసులను నిరంతరం పర్యవేక్షించాలని, గవర్నమెంట్ ప్లీడర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని సూచించారు. కేసులకు సంబంధించిన కౌంటర్లు, అవసరమైన రికార్డులు, పత్రాలను సకాలంలో అందజేసి, న్యాయపరమైన ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి కేసును ప్రాధాన్యంగా తీసుకుని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, గవర్నమెంట్ ప్లీడర్లు, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.




