Karimnagar: కరీంనగర్ పాఠశాల విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్
Karimnagar: కరీంనగర్ మార్కెట్ యార్డులో సెంట్రలైజ్డ్ కిచెన్ పనులను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారం.
Karimnagar: కరీంనగర్ పాఠశాల విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, పాలు అందించి ఆకలి తీర్చే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్.. జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసే సెంట్రలైజ్డ్ కిచెన్ పనులను కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులకు, మార్కెట్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్డు ఏర్పాటు పనులు చేసుకోవాలని ట్రస్ట్ డీజీఎం (ఆపరేషన్స్) రాముకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డిఓ షర్మిల, మార్కెట్ చైర్మన్ ఆకుల నరసయ్య, మార్కెట్ సెక్రెటరీ సయ్యద్ హమీద్, అధికారులు తదితరులు ఉన్నారు.
Next Story




