Karimnagar: కొత్త కార్యాలయ కాంప్లెక్స్ పనులపై కలెక్టర్ సమీక్ష!
Karimnagar: కరీంనగర్ నూతన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ పనులపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష.
Karimnagar: కొత్త కార్యాలయ కాంప్లెక్స్ పనులపై కలెక్టర్ సమీక్ష!
కరీంనగర్: నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ బ్యాలెన్స్ పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారుల ఆదేశించారు. తద్వారా జూన్ రెండులోగా ప్రారంభానికి కాంప్లెక్స్ ను అన్ని రకాలుగా సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా మిగిలి ఉన్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జూన్ రెండు లోగా అన్ని పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్ రెడ్డి ఆర్డీవో కే మహేశ్వర్ ఆర్ అండ్ బి ఎస్ఈ కే రామ్, ఈఈ నరసింహ చారి పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




