Karimnagar: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కలెక్టర్ దిశా నిర్దేశం

Karimnagar: కరీంనగర్‌లో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా ఆదేశించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 27 May 2026 9:35 PM IST
Karimnagar
X

Karimnagar: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. కలెక్టర్ దిశా నిర్దేశం

Karimnagar: జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. జిల్లా కేంద్రంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకలకు సీటింగ్ ఏర్పాట్లు, ఇతర అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్‌కు అనుగుణంగా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వేడుకలకు హాజరయ్య ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలందరికీ తగిన వసతులు సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.

జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రతిబింబించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు, సమాచార కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఫైర్ శాఖ, సఖి, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, మెప్మా, వ్యవసాయ శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యుత్ శాఖ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేక థీమ్ ఆధారిత స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామ స్థాయిలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను ఆవిర్భావ వేడుకల్లో ప్రదర్శించాలని, ఆస్తులు, రుణాల పంపిణీ సర్టిఫికెట్లు, స్వశక్తి మహిళలకు బ్యాంకు లింకేజీల పంపిణీ వంటి కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆహ్వానితులందరికీ ఆహ్వానాలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్ రెడ్డి ఆర్డిఓ మహేశ్వర్ డిసిపి వెంకటరమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి డిపిఓ జగదీశ్వర్ మెప్మా పీడీ స్వరూప రాణి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి డి ఆర్ డి ఓ గీత వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి బీసీడీవో అనిల్ ప్రకాష్, పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story