Karimnagar: కరీంనగర్‌లో ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థలో ప్రజావాణి కార్యక్రమం. ప్రజల నుంచి వచ్చిన 13 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 31 Aug 2026 4:53 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టొద్దు!

Karimnagar: నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం జరిగింది. నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, పలు డివిజన్లకు చెందిన ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సెక్షన్ల వారిగా అధికారులకు అప్పగించారు.

నగరపాలక సంస్థ ప్రజవాణీలో టౌన్ ప్లానింగ్ విభాగం 6,రెవెన్యూ 1, ఇంజనీరింగ్ 2, సానిటేషన్ 2, ఇందిరమ్మ 2 చొప్పున మొత్తం 13 ధరఖాస్తులు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ విభాగం నుండి ఆక్రమణల తొలగింపు, అనాథరైజ్డ్ కన్ స్ట్రక్షన్స్, ఇల్లీగల్ కన్ట్రక్షన్స్ సమస్యలు, రెవెన్యూ విభాగం నుండి టాక్స్ రివిజన్, న్యూ ప్రాపర్టీ, ఇందిరమ్మ, పారిశుధ్య తదితర సంబంధించిన సమస్యల పరిష్కారం పై ఆర్జీలు రావడం జరిగింది.

ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పరిష్కరించేలా చర్యలు తీస్కోవాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సెక్షన్ల వారిగా అధికారులకు ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో అదనపు కమీషనర్ ఆయాజ్, సువార్త, అసిస్టెంట్ కమీషనర్ రాజమనోహర్ డిసిపి బషీరొద్దిన్, ఏసీపి వేణు, ఇచార్జ్ ఈఈ లచ్చిరెడ్డి, వెటర్నరీ అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి, సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story