Karimnagar: తిమ్మాపూర్‌లో కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మల దహనం!

Karimnagar: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మలను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశాయి.

ANJANEYULU, MANAKONDURU
Published on: 7 Sept 2026 5:46 PM IST
Karimnagar
X

Karimnagar: తిమ్మాపూర్‌లో కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మల దహనం!

కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు తిమ్మాపూర్ మండలం లో కాంగ్రెస్ పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి రమేష్ , నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి లు మాట్లాడుతూ రాజ్యాంగపరమైన స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ పరుషపదజాలంతో ధూషించడం ఆక్షేపణీయన్నారు. స్పీకర్ కు భేషరతుగా ఎమ్మెల్సీ మధు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులంటేనే గిట్టని కేసీఆర్, మధు లాంటి వారి అహంకారాన్ని తగ్గించాలంటే శిక్ష తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story