Karimnagar: కరీంనగర్ సిటీ బస్సుల కోసం మంత్రికి వినతి
Karimnagar: కరీంనగర్‌లో సిటీ బస్సులను మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరిన వైద్యుల అంజన్ కుమార్. సానుకూలంగా స్పందించిన మంత్రి.
Karimnagar: కరీంనగర్ సిటీ బస్సుల కోసం మంత్రికి వినతి
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు గాను ఈరోజు హైదరాబాద్ సెక్రటేరియట్‌లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతిపత్రం సమర్పించిన వైద్యుల అంజన్ కుమార్.
అభివృద్ధి చెందుతున్న నగరంలో సిటీ బస్సుల అవసరం...
వినతిపత్రంలో కరీంనగర్ నగరం దినదినాభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం 6 లక్షల జనాభా కలిగిన కార్పొరేషన్ పరిధిలో 3 వైద్య కళాశాలలు, ఒక శాతవాహన విశ్వవిద్యాలయం ఉన్నాయని, ఇటీవల 14 గ్రామాలు విలీనం అయ్యాయని పేర్కొన్నరు.
విద్యార్థులు, రోగులు, ఉద్యోగులు మరియు సామాన్య ప్రజలు ప్రభుత్వ బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం వల్ల ఆర్థిక భారం పడుతుందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులకు మరియు పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
హామీ ఇచ్చిన మంత్రి పొన్నం...
మంత్రి సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు అని కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ అంజన్ కుమార్ తెలిపారు. సిటీ బస్సులు నడపడం వల్ల విద్యార్థులు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మంత్రి సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయిని తిరుపతి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కామిరెడ్డి రామ్ రెడ్డి, పెంట శేఖర్ పాల్గొన్నారు.




