Karimnagar: స్వెటర్ల వ్యాపారులకు అండగా నిలిచిన కార్పొరేటర్ కేఏపీపీ చంద్ర

Karimnagar: కరీంనగర్‌లో చలికాలంలో ఉన్ని దుస్తులు అమ్ముకునే చిన్న తరహా వ్యాపారులకు మేయర్, కమిషనర్లతో మాట్లాడి అనుమతులు ఇప్పించిన కార్పొరేటర్ టింకు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 30 Oct 2026 9:54 PM IST
Karimnagar
X

Karimnagar: స్వెటర్ల వ్యాపారులకు అండగా నిలిచిన కార్పొరేటర్ కేఏపీపీ చంద్ర

కరీంనగర్: చలికాలంలో తెలంగాణ అమరవీరుల స్తూపం పక్కన, పాత మున్సిపల్ గెస్ట్ హౌజ్ వద్ద, ఐడిసిసి గోడను ఆనుకొని స్వెటర్లు, టోపీలు, బ్లాంకెట్లు అమ్ముకునే చిన్న తరహా వ్యాపారులకు 37వ డివిజన్ కార్పొరేటర్ కెఎపిపి చంద్ర (టింకు) అండగా నిలిచారు.

37, 38వ డివిజన్లకు చెందిన జాకీర్ ఖాన్‌తో పాటు పలువురు రిటైల్ ఉన్ని దుస్తుల వ్యాపారులు తమకు క్రయవిక్రయాలు చేసుకునేందుకు అనుమతి ఇప్పించాలని కార్పొరేటర్ టింకును అభ్యర్థించారు. వ్యాపారులలో అధిక శాతం మంది తమ డివిజన్ల వారే కావడంతో స్పందించిన ఆయన, వెంటనే మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌లతో మాట్లాడారు.

చలికాలం ముగిసేంత వరకు వ్యాపారులు పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ వద్ద ఎప్పటిలాగే వ్యాపారం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని విన్నవించారు. కార్పొరేటర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన అధికారులు మున్సిపల్ శాఖ ద్వారా వ్యాపారాలకు అనుమతి మంజూరు చేశారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ టింకు మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ నుండి తాము కష్టపడి అనుమతి ఇప్పిస్తే, కొందరు ఎంఐఎం నాయకులు సోషల్ మీడియా వేదికగా తామే ఈ అనుమతులు ఇప్పించామని డబ్బా కొట్టుకోవడం సరికాదన్నారు. ఎంఐఎం నేతలకు, కార్పొరేటర్లకు అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు.

డివిజన్ ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి వైపే నిలుస్తారు తప్ప అసత్య ప్రచారాలను నమ్మరని ఎంఐఎం నాయకులకు హితవు పలికారు. మేయర్, కమిషనర్ కలిసిన వారిలో బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ , పో ఆప్షన్ సభ్యులు బల్వీర్ సింగ్ , పలువురు మైనార్టీ నేతలు ఉన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR