Karimnagar: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కీలక నిర్ణయం.. ఏఎస్సైలకు ప్రమోషన్లు!
Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో 7 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి కల్పించిన సీపీ గౌష్ ఆలం.
Karimnagar: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కీలక నిర్ణయం.. ఏఎస్సైలకు ప్రమోషన్లు!
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఎస్సై (సివిల్)లకు ఎస్‌ఐ (సివిల్) హోదాకు పదోన్నతులు కల్పిస్తూ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేవా నియమావళి ప్రకారం జోన్-3 రాజన్న పరిధిలో ఖరారు చేసిన సీనియారిటీ జాబితా ఆధారంగా ఈ పదోన్నతులు ఇవ్వబడినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన అధికారులను పరిపాలనా అవసరాలకు అనుగుణంగా కరీంనగర్ కమిషనరేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా, మరియు సిద్ధిపేట కమిషనరేట్ తదితర యూనిట్లకు కేటాయించారు. ఈ పదోన్నతి పొందిన అధికారులు 15 రోజులలోగా తమకు కేటాయించిన కొత్త విధి స్థలాల్లో హాజరుకావాలని సీపీ ఆదేశించారు.
పదోన్నతి పొందిన అధికారుల పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తపల్లి పి.ఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న మొగురం సుధాకర్, కరీంనగర్-III టౌన్ పి.ఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న మురహరి యాదగిరి, మరియు చిగురుమామిడి పి.ఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న వీర తిరుపతి గార్లకు ఎస్సైలుగా పదోన్నతి లభించగా, వీరు ముగ్గురినీ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనే కేటాయించడం జరిగింది. అలాగే కరీంనగర్-I టౌన్ పి.ఎస్ ఏఎస్సై మహమ్మద్ నజీముద్దీన్, కరీంనగర్-III టౌన్ పి.ఎస్ ఏఎస్సై సయ్యద్ అబ్దుల్ రజాక్, మరియు గంగాధర పి.ఎస్ ఏఎస్సై మొగిలి మల్లేశం గార్లకు ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ, వారిని రాజన్న సిరిసిల్ల జిల్లాకు కేటాయించారు. ఇంటెలిజెన్స్-సిద్ధిపేట లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎండి.ఇర్షాద్ కు ఎస్సైగా ప్రమోషన్ ఇచ్చి కరీంనగర్ కమిషనరేట్ కు బదిలీ చేయగా, కేశవపట్నం పి.ఎస్ లో ఏఎస్సైగా పనిచేస్తున్న సయ్యద్ పాషా కు ఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ సిద్ధిపేట కమిషనరేట్ కు కేటాయించారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఎస్సైలు బుధవారం కమీషనరేట్ కార్యాలయంనందు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు ఎస్సై మామిడి సురేందర్ ద్వారా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ని మర్యాదపూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. సీపీ వారికి అభినందనలు తెలియజేస్తూ, నూతన బాధ్యతలలో మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.




