Karimnagar: 15 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం!
Karimnagar: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 15 మంది రౌడీ షీటర్లను సీపీ గౌస్ ఆలం బుధవారం రూ.1 లక్ష పూచీకత్తుతో బైండోవర్ చేశారు.
Karimnagar: 15 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం!
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 15 మంది రౌడీ షీటర్లను బుధవారం (25-11-2026) బైండోవర్ చేయడం జరిగిందని సీపీ గౌష్ ఆలం తెలిపారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్) గౌస్ ఆలం, ఎదుట వీరిని హాజరుపరచగా, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 126 నుండి 136 సెక్షన్ల ప్రకారం విచారణ జరిపి, ఒక సంవత్సరం పాటు సత్ప్రవర్తనతో మెలుగుతామని రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) పూచీకత్తుతో కూడిన బాండ్లను (Bind Over) రాయించుకోవడం జరిగిందన్నారు.
బైండోవర్ చేయబడిన రౌడీ షీటర్ల వివరాలు (పోలీస్ స్టేషన్ల వారీగా):
* జమ్మికుంట పీఎస్: కుక్కల రమేష్, రాచపల్లి ప్రశాంత్ (2)
*కరీంనగర్-II టౌన్ పీఎస్: షేక్ ఖాజా మొయినుద్దీన్ @ మతిన్, కొత్తకొండ శ్రీనివాస్ @ పోగు శ్రీను (2)
* కరీంనగర్-I టౌన్ పీఎస్: సుంచు కిషోర్ (1)
*కరీంనగర్ రూరల్ పీఎస్: ఎడెల్లి సతీష్ (1)
*కొత్తపల్లి పీఎస్: సుద్దాల ప్రణయ్ (1)
* మానకొండూర్ పీఎస్: నన్నవేని రమేష్ (1)
* హుజూరాబాద్ పీఎస్: నోముల అంజి @ అంజయ్య (1)
*చొప్పదండి పీఎస్: బండారి మహేష్ @ మహేష్ బాబు (1)
* ఎల్లందకుంట పీఎస్: చల్లూరి చంటి (1)
* చిగురుమామిడి పీఎస్: గొర్రెంకల సంతోష్ (1)
* వీణవంక పీఎస్: నల్లవెల్లి నవీన్ (1)
* సైదాపూర్ పీఎస్: వోలద్రి తిరుపతి రెడ్డి (1)
* కేశవపట్నం పీఎస్: రణవేని హరీష్ (1)
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడినా, ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా పూచీకత్తు సొమ్మును జప్తు చేయడంతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు (జైలు శిక్షతో సహా) తీసుకోబడతాయని హెచ్చరించారు.




