Karimnagar: కరీంనగర్‌లో సీపీఐ వినూత్న నిరసన.. ఖాళీ బిందెలతో ధర్నా!
Karimnagar: కరీంనగర్ ఎల్ఎండి నీటిని పక్క జిల్లాలకు తరలించడాన్ని నిరసిస్తూ ఖాళీ బిందెలతో సీపీఐ ధర్నా చేపట్టింది. పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Karimnagar: కరీంనగర్‌లో సీపీఐ వినూత్న నిరసన.. ఖాళీ బిందెలతో ధర్నా!
కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ లో ఉన్న నీటిని ప్రక్క జిల్లాలకు తరలించి కరీంనగర్ ప్రజలు త్రాగునీటికి కష్టాలను,కన్నీళ్లను చవిచూడాల్సి వస్తుందని,కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు,కుంటలు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పాటించుకోవడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆరోపించారు.
నగరంలో త్రాగునీటి ఎద్దడిని నివారించాలని,విలీన గ్రామాల కుంటలు,చెరువులను కాపాడాలని గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు.
త్రాగునీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ఖాళీ బిందెలతో విన్నూతనంగా నిరసన తెలపడానికి సిపిఐ నాయకులు,కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.నాయకులకు పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింది.అనంతరం సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ తలాపున నీళ్ళున్నా చాప దూపకు ఏడ్చినట్టు కరీంనగర్ లో మానేరు డ్యామ్ ఉన్నప్పటికీ ప్రజలు త్రాగునీటికి అనేక.ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని,ఎండా కాలంలో ప్రజలకు నీరందక భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోర్ల లల్లో నీరు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని,నగర వ్యాపితంగా ఎటు చూసినా,ఏ డివిజన్ కు వెళ్లినా ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందుకు ప్రధాన కారణం అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వక పోవడమేనని,స్థానిక ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్.పార్టీ,స్థానిక ఎంపీ బి. జె. పి పార్టీ,అటు కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధి లేకపోవడం ఇలా నాయకుల ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడం అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వారికి సరైనమార్గదర్శకాలుఇవ్వకపోవడమేనని,కరీంనగర్ ప్రజల దాహార్తి తీర్చే నాధుడే కరువయ్యాడని శ్రీనివాస్ ఆరోపించారు.
ఇటీవలి కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు,కుంటలు కబ్జాలకు గురవుతున్నాయని,రియల్ ఎస్టేట్ వారు వాటిని కబ్జాలు చేస్తున్నారని,ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నారని,ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని కొరవడిందని,ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు,ఇటు రెవెన్యూ అధికారులు నగర ప్రజల త్రాగునీటి కష్టాలను,భూముల కబ్జాలను నిలువరించాలని లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు నిర్వహించక తప్పదని శ్రీనివాస్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు,కటికరెడ్డి బుచ్చన్న యాదవ్,బీర్ల పద్మ, కొట్టె అంజలి, మచ్చ రమేష్,శాఖ కార్యదర్శులు బాకం ఆంజనేయులు,గామినేని సత్యం చెంచల మురళి,నగునూరి రమేష్,కాల్వ.శ్రీనివాస్ ,ఈ.భారతి,కేంసారం శ్రీనివాస్,అల్లేపు రాజు,నునావత్ శ్రీనివాస్,మామిడిపల్లి హేమంత్ కుమార్,మమత,స్రవంతి,దానవేణి రమేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు




