Karimnagar: మున్సిపల్ టెండర్లపై న్యాయ విచారణ జరిపించాలి

Karimnagar: రూ.50 కోట్ల టెండర్ల గోల్‌మాల్? 89 పనులకు గాను 69 సింగిల్ టెండర్లు రావడంపై ఐఏఎస్ అధికారి, మున్సిపల్ కమిషనర్ న్యాయవిచారణ జరపాలని సీపీఎం డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 30 May 2026 2:27 PM IST
Karimnagar
X

Karimnagar: మున్సిపల్ టెండర్లపై న్యాయ విచారణ జరిపించాలి

కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 89 పనులకు టెండర్ వేయగా 69 పనులకు సింగిల్ టెండర్ రావడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ప్రశ్నించారు. 50 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసేందుకు అధికార బిజెపి కార్పొరేటర్లు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి, అంతా కలిసి కుమ్మక్కై ప్రభుత్వాదాయానికి గండి కొట్టే విధంగా ఇతరులను టెండర్లు వేయకుండా ఒకే పనికి ఒకే టెండర్ వచ్చే విధంగా వ్యవహరించారని, దీనిపైన మున్సిపల్ కమిషనర్ న్యాయవిచరణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టర్ల యూనియన్ 50 లక్షలు పోగేసుకొని సంబంధిత అధికారులను ప్రభావితం చేశారని, ఆమ్యామ్యాలు తీసుకున్న అధికారులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకే దేశం, ఓకే చట్టం అనే నినాదం ఒకే పనికి ఒక పనికి ఒకటే టెండరా? అంటూ ఎద్దేవా చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజాధనాన్ని లూటీ చేయాలని ప్రయత్నిస్తే కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో అవకతవకలను బయటపెడతామని, ఇప్పటికైనా ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ న్యాయవిచారణ జరిపించి టెండర్లు తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story