Jammikunta: ప్రజా సమస్యలపై జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

Jammikunta: జమ్మికుంటలో ప్రజా సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 31 Aug 2026 5:05 PM IST
Jammikunta
X

Jammikunta: ప్రజా సమస్యలపై జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ గత మూడు నెలలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు గ్రామాలను, ప్రభుత్వ పాఠశాలలను, ఆసుపత్రులను సందర్శించడం జరిగిందన్నారు. ప్రభుత్వ బడుల్లో అనేక సమస్యలు ఉన్నాయనీ, ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేరన్నారు.

అనేక ప్రభుత్వ బడుల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందనీ, స్వీపర్స్, అటెండర్స్ లేరన్నారు. క్లాస్ రూమ్స్ శిథిలావస్థలో ఉన్నాయనీ. కొన్ని స్కూళ్లలో పెద్ద చెట్లు ఉండడం మూలంగా ఈదురు గాలులకు విరిగిపడితే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రైవేటు బడుల్లో ఇష్టారితిన ఫీజులు వసూలు చేస్తున్నారనీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. పేషెంట్లకు కావలసిన మందులు లేవని, సమయానికి డాక్టర్లు, సిబ్బంది రావడం లేదన్నారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడి విపరీతంగా పెరిగిపోయింది అన్నారు. అర్హులైన పేదలకు రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో చేతి బోర్ పంపులు పనిచేయడం లేదని వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతు చేయాలన్నారు. రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు సరఫరా చేయాలన్నారు. కరెంటు కోతలను నివారించాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రైవేట్ స్కూల్స్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న డబుల్ బెడ్ రూమ్ ల ఇండ్లు అరులైన పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించి, అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.

పాత పద్ధతిలోనే రైతులకు ఎరువులు అందించాలన్నారు. పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి సీటు ప్లస్ 50% ప్రకారం మద్దతు ధరలు నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జక్కుల రమేష్ యాదవ్, మండల కమిటీ సభ్యులు రావుల ఓదెలు, చేరాలు, రమేష్, సాయిరాం, నాగరాజు, సురేష్, హరీష్, సమ్మయ్య, ఖలీల్ పాషా, ఉడుత నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జక్కుల రమేష్ యాదవ్. సిపిఎం మండల కార్యదర్శి జమ్మికుంట.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story